Breaking News: జనసేనలో చేరనున్న మాజీ మంత్రి.. త్వరలో పవన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-01-12 06:55 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతల విషయంలో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో తాజాగా ఓ వార్త వెలుగు చూసింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు.

ఈ విషయం పైన ఆయన అనుచరులు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రామకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారని.. అనంతరం ఆయన అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ విషయం పైన స్పష్టత ఇస్తారని అనుచరులు తెలిపారు. అలానే రానున్న ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు మాజీ మంత్రి ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన అనుచరులు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా మాజీ మంత్రి రామకృష్ణ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

కాగా గతంలో ఉత్తరాంధ్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన రామకృష్ణ కాంగ్రెస్స్ పార్టీ నుండి పోటీ చేసి సింగిల్ డిజిట్ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. అయితే మొదట్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం ఉండేది. కాగా 2014లో వైసీపీ ఓటమిని చవిచూసింది. దీనితో రామకృష్ణకు ఎదురైనా వైఫల్యాలు ఆయన్ను అధిష్టానం నుండి దూరంగా ఉంచాయి అని రాజకీవర్గాల అభిప్రాయం.

Tags:    

Similar News