AP:‘గొడవ వైసీపీ వాళ్లతోనే.. అదానీ సంస్థతో కాదు’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కూటమి, వైసీపీ నేతల(YSP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Update: 2024-11-20 14:14 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి, వైసీపీ నేతల(YSP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(MLA Adinarayana Reddy) వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. నిన్న(మంగళవారం) జరిగిన గొడవ వాళ్లతోనేనని, అదానీతో కాదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా ఏర్పాటు కానీ అదానీ పరిశ్రమకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణీ అవుతున్న దొంగ దుకాణాలనే తమ వాళ్లు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News