సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్

ఏపీ సీఎం చంద్రబాబుకి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.

Update: 2024-12-19 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ పార్లమెంట్ సమావేశలు(ParliamentSessions) ప్రస్తుతం అంబేధ్కర్(Ambedkar) చుట్టు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) చేసిన వ్యాఖ్యలను నిరసనగా.. ఇండియా కూటమి(India Alliance) సభ్యులు ఈ రోజు పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu)కి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Former CM Arvind Kejriwal) లేఖ(letter) రాశారు. బాబా సాహెబ్‌ అంబేధ్కర్ (Ambedkar)ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. అమిత్ షా తన వ్యాఖ్యలపై కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేంటో తెలియజేయాలని కోరుతున్నాను అని కేజ్రీవాల్ తన లేఖలో రాసుకొచ్చారు. మరీ ఈ లేఖపై సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.


Similar News