మూడుసార్లు టెస్ట్ చేశాకే అనుమతి: నెయ్యి కొనుగోళ్లపై జగన్ కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూకు చాలా విశిష్టత ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు..

Update: 2024-09-27 11:08 GMT

దిశ, వెబ్ డెస్క్:తిరుమల లడ్డూకు చాలా విశిష్టత ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు.. తిరుమల పర్యటన రద్దు నేపథ్యంలో ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యికి ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తారని తెలిపారు. క్వాలిఫై అయిన వారికే టెండర్లు దక్కుతాయని చెప్పారు. ఇది రొటీన్‌గా జరిగే ప్రక్రియని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని తెలిపారు. తిరుమలకు నెయ్యి ట్యాంకర్లు వచ్చిన తర్వాత మూడుసార్లు టెస్టులు చేస్తారని, అక్కడ పాస్ అయితేనే తీసుకుంటారని చెప్పారు. తమ హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేశామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నెయ్యి సప్లై మొదలైందని తెలిపారు. జులై 6, 12న వచ్చిన నాలుగు ట్యాంకర్లు టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయని తెలిపారు. అలా రిజెక్ట్ అయిన నెయ్యి ట్యాంకర్లను మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ పంపిస్తారని జగన్ స్పష్టం చేశారు. 

ఎన్డీడీబీ రిపోర్టును గుజరాత్ పంపారని జగన్ చెప్పారు. ట్యాంకర్లు వెనక్కి పంపడంతో పాటు వారికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాడని నెయ్యి అని తెలుస్తున్నా దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తు్న్నారని జగన్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు. ప్రసాదం తినే వారిలో అనుమానాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. రోజుకో అబద్ధాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారని జగన్ విమర్శించారు.

Read More : జగన్‌పై భౌతిక దాడికి కుట్ర.. టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన ఆరోపణలు


Similar News