ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలు.. చంద్రబాబు పాలనపై జగన్ సంచలన వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు నాలుగు నెలల పాలనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ...

Update: 2024-10-02 10:22 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (Cm Chandrababu) నాలుగు నెలల పాలనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాలపై దృష్టి పెట్టిన ఆయన అమరావతి (Amaravati)లో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు. తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. విజయవాడ వరదల(Vijayawad Floods)పై స్పందించిన ఆయన బాధితుల కష్టాలు వర్ణణాతీమన్నారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకు కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన దేవుడికి కూడా ఆగ్రహం తెప్పిస్తోందని విమర్శించారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని, అండగా ఉంటానని కార్యకర్తలకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 

Tags:    

Similar News