కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. మాజీ సీఎం జగన్ నిర్ణయం ఇదే..!

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు..

Update: 2024-07-22 02:45 GMT
కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు.. మాజీ సీఎం జగన్ నిర్ణయం ఇదే..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభంకాగానే అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీసీఏ మీటింగ్‌ జరగనుంది. సభ ఐదు రోజుల పాటు జరిపే అంశంతో పాటు పలు బిల్లుల ఆమోదంపైనా సభ్యులు చర్చించనున్నారు. సభకు సహకరించాలని బీఏసీ మీటింగ్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యులకు సూచించనున్నారు.

అయితే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. గ‌వ‌ర్నర్ ప్రసంగం సంద‌ర్బంగా రాష్ట్రంలో శాంతిభ‌ద్రత‌ల వైఫ‌ల్యంపై గొడ‌వ చేయాల‌ని,  అలాగే ఉద‌యం 9 గంట‌ల‌కు అసెంబ్లీ ముందు ప్లకార్డుల‌తో నిర‌స‌న వ్యక్తం చేయాల‌ని కూడా ఎమ్మెల్యేల‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభ‌ద్రత‌లు గాడిత‌ప్పాయ‌ని ఆదివారం సాయంత్రం ఏపీ గ‌వ‌ర్నర్ అబ్దుల్ న‌జీర్‌ను వైఎస్ జ‌గ‌న్ రాజ్‌భ‌వ‌న్‌లో క‌లిశారు. కూట‌మి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News