టీడీపీ కో ఆర్డినేషన్ కమిటీ నియామకం: జనసేనతో చర్చించేది ఈ ఐదుగురే
తెలుగుదేశం,జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం,జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అధినేతలు ప్రకటించారు. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాగే ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన తరఫున ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ సైతం కమిటీని ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని అచ్చెన్నాయుడు ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య (మాజీ ఎమ్మెల్యే)లకు ఈ కమిటీలో చోటు కల్పించింది. ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ కమిటి పని చేయటం జరుగుతుంది అని అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.