Food poisoning: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

ఫుడ్ పాయిజన్ అయి 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2024-08-31 03:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫుడ్ పాయిజన్ అయి 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొర్రాయి పంచాయతీ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో శుక్రవారం సాయంత్రం భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులంతా అస్వస్థతకు గురికావడంతో గమనించిన సిబ్బంది వారిని వెంటనే చికిత్స నిమిత్తం అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వసతి గృహంలో సాయంత్రం భోజనంలో కోడిగుడ్డు, సాంబారు రసం పెట్టగా వాటిని తిన్న విద్యార్థిను అస్వస్థతకు గురైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. వసతి గృహంలో 79 మంది విద్యార్థినులు ఉండగా అందులో 40 మందికి పైగా బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా అరకు ఏరియా ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారు. బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యాధికారి ఆదిత్య పేర్కొన్నారు. 


Similar News