ఏపీపై వాయుగుండం తీవ్ర ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి.
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఈ తీవ్ర వాయుగుండం సోమవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశాలోని పూరీ-పశ్చిమ బెంగాల్ ప్రాంతం డేగ అల మధ్య తీరం దాటింది. అయినప్పటికి ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తునే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలతో పాటు ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో రేపు 11:30 వరకు ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖతో పాటు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే వరదల వచ్చే అవకాశం ఉందని అధికారులు అలర్ట్ జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.