మరో ప్రభుత్వ కార్యాలయంలో పత్రాలు దగ్ధం.. భూ సేకరణ దస్త్రాలుగా అనుమానం

ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం పరపర కొనసాగుతోంది. ...

Update: 2024-08-17 11:28 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం పరపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు కార్యాలయాల్లో ఫైళ్లు దగ్ధం కావడంతో ప్రభుత్వం, ఉన్నతాధికారులు సీరియస్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు కేసులు నమోదు చేసి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానంతో లోతైన విచారణ జరుపుతున్నారు. అయినా మరో ప్రభుత్వ కార్యాలయంలో పత్రాలు దగ్ధం అయ్యాయి. శనివారం మధ్యాహ్నం ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో పత్రాలు కాలిపోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన పత్రాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి పరిశీలించారు. సగం కాలిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలుగా అనిమానిస్తున్నారు. అనుమానస్పద స్థితిలో పత్రాలు దగ్ధమయినట్లు గుర్తించారు. విచారణ జరిపి త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి పేర్కొన్నారు.  

Tags:    

Similar News