అల్లూరి జిల్లాలో దారుణం.. 4 కి. మీ మేర డోలిలో మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు

విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందిన మహిళా రోగిని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువులు అష్టకష్టాలు పడ్డారు.

Update: 2024-08-16 05:49 GMT

దిశ, వెబ్ డెస్క్: మారుమూల ప్రాంతాల్లో ఇంకా వసతులు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపద వచ్చి వైద్యం చేయించుకునేందుకు సైతం సరైన ఆస్పత్రులు లేవు. పరిస్థితి విషమించి పెద్దాస్పత్రికి వెళ్దామన్నా రోడ్డు సౌకర్యం లేదు. దీంతో వైద్యం చేయించుకునేందుకు గర్భిణీలు, వృద్ధులు చాలా అవస్తలు పడుతున్నారు. కొన్ని సమయాల్లో సరైన సమయానికి ఆస్పత్రులకు చేరుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. అలా ప్రాణాలు పోయినా స్వగ్రామాలకు చేరుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. సరైన రోడ్లు లేక మృతదేహాలను గ్రామాలకు తీసుకెళ్లాలంటే డోలి మోత తప్పడంలేదు. ఇటువంటి ఘటన అల్లూరు జిల్లాలో మరోసారి జరిగింది.

అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గంగమ్మ విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో కేజీహెచ్ నుంచి పెదబయలు మండల కొతూరు వరకూ తీసుకెళ్లారు. కానీ అక్కడి నుంచి డోలిమోత తప్పలేదు. రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో మహిళ మృతదేహాన్ని బంధువులు డోలీలో నాలుగు కిలో మేర తీసుకెళ్లారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ బతుకుతులు మాత్రం మారడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీలు ఇస్తారని, ఆ తర్వాత మర్చిపోతారని వాపోయారు. 

Tags:    

Similar News