AP News:వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల వివాదం.. స్పందించిన పట్టాభిరామ్!

ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య ఆస్తుల వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

Update: 2024-10-27 13:02 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) మధ్య ఆస్తుల వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ(TDP) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. నేడు(ఆదివారం) అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌(NTR Bhavan)లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్(Pattabhiram) మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కుటుంబంలో ‘ఫ్యామిలీ’ డ్రామా(Family drama) నడుస్తోందన్నారు.

తాడేపల్లి నివాసానికి పనిచేసే ముఠాగా సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్నారని ఆయన విమర్శించారు. ఇక తాడేపల్లి నుంచి ఆదేశాలు రాగానే చెప్పింది చెప్పినట్టు చేస్తారని ఎద్దెవా చేశారు. సీఎం చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిల కీలుబొమ్మగా మారిందని ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. జగన్ కు, తనకు మధ్య 2019లో ఒప్పందం కుదిరిందని షర్మిల చెబుతున్నారు. ఆస్తుల పంపకం విషయమై ఎంవోయూ(MOU) జరిగిందని షర్మిల అంటున్నారు. మరి చంద్రబాబు సమక్షంలో జగన్, షర్మిల మధ్య ఎంవోయూ జరిగిందా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News