సీఎం చంద్రబాబు ఇంటి పై దాడి కేసు..ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి తీవ్ర ప్రయత్నాలు

సీఎం చంద్రబాబు నివాసం పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Update: 2024-09-11 12:31 GMT

దిశ,వెబ్‌డెస్క్:సీఎం చంద్రబాబు నివాసం పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ కోసం ఇదివరకే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఆయన పిటిషన్‌(Petition)ను హైకోర్టు(High Court) కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు అని సమాచారం. ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్(Petition) దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, జోగి రమేష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు (సెప్టెంబరు 12) విచారించే అవకాశం ఉంది.


Similar News