Minister Nimmala:ప్రతి కుటుంబం ఆనందోత్సవాలతో దీపావళి పండుగ జరుపుకోవాలి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
దిశ, పాలకొల్లు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో జగన్ ఐదేళ్ల రాక్షస, నిరంకుశ, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి ఎన్డీయే ప్రభుత్వానికి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలందరూ చెడుపై సాధించిన మంచి విజయానికి గుర్తుగా ఈ దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటామన్నారు. చీకటి నుంచి కాంతులు విరజిమేలా పిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకునే ఈ పండుగ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఆనందంగా గడపాలని భగవంతుని ఆశీస్సులతో ఈ దీపావళి పండుగ రాష్ట్ర ప్రజలకు అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ మంత్రి రామానాయుడు ఆకాంక్షించారు.