AP News:పంటల బీమా పథకాన్ని సర్వనాశనం చేసింది జగనే: టీడీపీ ఎమ్మెల్సీ

పంటల బీమా పథకాన్ని సర్వనాశనం చేసింది జగనే అని.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి ఆయన ప్రభుత్వంలో ఎందుకు బయటకు వచ్చారు.

Update: 2024-10-30 13:54 GMT

దిశ, కడప: పంటల బీమా పథకాన్ని సర్వనాశనం చేసింది జగనే అని.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి ఆయన ప్రభుత్వంలో ఎందుకు బయటకు వచ్చారు. మళ్ళీ ఎందుకు చేరారని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. రబీ పంటలకు బీమా పథకాన్ని ఎందుకు ఎత్తివేశారనీ, 2019లో 333 కోట్ల బీమా సొమ్మును రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఉచిత పంటల బీమాలో ఏ పంటకు బీమా కట్టారో తెలియని పరిస్థితి అని అన్నారు. రైతుల అభిప్రాయం మేరకు కొత్త పంటల బీమా విధానమని అన్నారు. ఇంటి రచ్చ పక్కదోవ పట్టించడానికే రైతులపై జగన్ కపట ప్రేమ చూపుతున్నారని అన్నారు. మీ పాలన బాగున్నింటే రాష్ట్రంలోనే పులివెందుల రైతుల ఆత్మహత్యలో ఎందుకు అగ్రగామిగా నిలిచారని ప్రశ్నించారు.


Similar News