చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు విద్యుత్ అధికారి క్షమాపణలు.. కారణం ఇదే..!
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డీఈ ఇంటి ముందు నిరసన చేపట్టిన కార్యకర్తలు అతనితో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పించారు.
దిశ వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డీఈ ఇంటి ముందు నిరసన చేపట్టిన కార్యకర్తలు అతనితో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల సమయంలో డీఈ మన్నెం విజయ భాస్కరరావు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టింగ్‌లు పెట్టారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు డీఈ మన్నెం విజయ భాస్కరరావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇరు పార్టీల కార్యకర్తలు అతని ఇంటి ముందు నిరసనకు దిగారు.దీనితో తాను పొరపాటున చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టింగ్‌లు షేర్ చేశానంటూ డీఈ మీడియాకు వివరణ ఇచ్చారు. అనంతరం విజయ భాస్కరరావు చేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు జనసైనికులు పాలాభిషేకం చేయించారు.