Breaking: ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్.. క్యూలైన్‌లో ఓటర్లు
ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. మరోవైపు పోలింగ్ సెంటర్ల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత క్యూ లైన్‌లో ఉన్న వాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సమయం ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అటు ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తోంది. వెబ్ క్యాస్టింగ్ సైతం ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎన్నికల సిబ్బంది ఈ తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం పోలింగ్‌కు ఓటర్లను అనుమతిస్తున్నారు. ఓటర్లు స్లిప్పులు, గుర్తింపు కార్డులు పరిశీలించి ఓటింగ్‌కు పంపుతున్నారు. సాయంత్రం ఎన్నికలు ముగిసిన తర్వాత పటిష్ట భద్రత మధ్య ఈవీఎం బ్యాక్సులను పోలింగ్ కేంద్రాల నుంచి తరలించి భద్రపరుస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.