Toxic effect : పంట పొలాలపై విష ప్రభావం.. ఆందోళనలో అన్నదాత

ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపుగా 1800 పంట బోదెలున్నాయి. సెంట్రల్ డెల్టా,ఈస్ట్రన్ డెల్టాల నుంచి....Toxic effect on Crop Fields.. Formers Concern

Update: 2022-11-21 11:45 GMT

దిశ (ఉభయ గోదావరి): పంట బోదెలు. వీటీ వల్ల వరి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రధానంగా పంట కాల్వల నుంచి సాగు నీరు క్రమబద్ధీకరంగా బోదెలలోకి వస్తుంది. అక్కడి నుంచి పొలాలకు చేరతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న పంట బోదెలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో సాగునీరు ప్రవాహం లేకుండా ఆగిపోతుంది. ఫలితంగా పొలాలు నీటి ఎద్డడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో రైతులు దారుణంగా నష్టబోతున్నారు. గోదావరి జిల్లాల రైతులు పలు ఆందోళనలు చేశారు. విషయమై ప్రభుత్వం స్పందించింది. ఉభయ గోదావరి జిల్లాలకు 5 కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు చేయడంలో గుత్తేదారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. ఫలితంగా సమస్య పరిష్కారం ఎలా ఉన్నా పంట పొలాలు మాత్రం నాశనమౌతున్నాయి. కాకినాడ జిల్లా కాజులూరులో గుత్తేదారుడు నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాలు నాశనమయ్యాయి. ఇలా అనేక చోట్ల జరిగింది. పరిహారం ఇప్పించమని రైతులు డిమాండు చేస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపుగా 1800 పంట బోదెలున్నాయి. సెంట్రల్ డెల్టా,ఈస్ట్రన్ డెల్టాల నుంచి నిత్యం పంట కాల్వలకు నీరు విడుదలౌతుంది. అలా వచ్చిన నీరు బోదెలకు మళ్ళుతుంది. పూర్వం నీటి పారుదల శాఖ వారు నిర్మించిన స్లూయిస్‌ల ద్వారా బోదెల నుంచి నీరు పొలాలకు చేరుతుంది. అక్కడ రైతు తమకు అవసరమైన నీటిని వాడుకుని మిగతా నీరు బోదెలోనే వదులుతారు. అయితే అంతటి ఉపయోగకరంగా ఉన్న బోదెలు తూటుతో పేరుకునిపోయాయి. ఫలితంగా సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు బీటలు వారుతున్నాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించింది. డెక్క, తూటు తొలగించేందుకు నిధులు మంజూరు చేసింది. అయితే ఆయా నిధులతో పనూలు చూపించి లాభాలు అర్జించేందుకు గుత్తేదారులు రంగ ప్రవేశం చేశారు. కాకినాడ జిల్లా కాజులూరులో బోదెలో ఒక గుత్తేదారుడు మందు నిర్లక్ష్యంగా పిచికారీ చేశాడు. దీంతో ఆయా మందు పక్కనే ఉన్న పంట పొలాలకు చేరి నాశనమైంది.ఆయా రైతు గగ్గోలు పెడుతున్నాడు. ఇలా గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల జరిగింది. పరిహారం కోసం రైతులు పట్టుపడుతున్నారు,


Similar News