Breaking: ఏలేరు కాలువకు గండి
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కురిసిన వర్షాలకు అతలాకుతలమైన కాకినాడ (Kakinada District) జిల్లాకు ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి(Flood Water)తో ఏలేరు కాలువ (Yeleru canal)ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాదు వరద దాటికి మాకవరం మండలం రాచపల్లి వద్ద గండి (Breach) పడింది. 10 అడుగుల మేర గట్టు తెగిపోయింది. దీంతో అండర్ టన్నెల్ నుంచి వరద నీరు స్థానిక గెడ్డలోకి వెళ్తోంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గండి పూడ్చివేతపై చర్యలు చేపట్టారు. పనులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గండి పడిన చోట ప్రొక్లెయిన్లతో ఇసుక, మెటల్ మూటలను వేస్తున్నారు. గండి పూడ్చివేత పనుల్లో వేగం పెంచారు. రెండు, మూడు గంటల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
అయితే ఏలేరు కాలువకు తరచూ గండ్లు పడుతున్నాయని, దాని వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఒక్కోసారి పొలాలు నాశనం అవుతున్నాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.