జి రాగంపేటలో పెను విషాదం.. ఏడుగురు మృత్యువాత

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేటలో పెను విషాదం జరిగింది. అంబటి సుబ్బన్న ఆయిల్ కర్మాగారంలో ట్యాంకులను శుభ్రం చేసే సమయంలో విషవాయువులు ఉత్పత్తి అయి ఊపురాడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ..

Update: 2023-02-09 09:55 GMT

దిశ,పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేటలో పెను విషాదం జరిగింది. అంబటి సుబ్బన్న ఆయిల్ కర్మాగారంలో ట్యాంకులను శుభ్రం చేసే సమయంలో విషవాయువులు ఉత్పత్తి అయి ఊపురాడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు. దీంతో జి.రాగంపేట గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుల్లో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన వాసులు కాగా, పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.

విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ కృత్తికా శుక్ల,జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, మాజీ మంత్రి, శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప, అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫ్యాక్టరీ సీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఫ్యాక్టరీలో భద్రత ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా అనేదానిపై కూడా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని  కలెక్టర్ హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News