Uppadaలో Tdp Bc సదస్సుకు సన్నాహాలు
జనవరి నెలలో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో బీసీల సదస్సు నిర్వహించనున్నట్లు మాజీ శాసన సభ్యుడు, టీడీపీ అధికార ప్రతినిధి వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన 200 మంది మత్స్యాకారులతో సమావేశం నిర్వహించారు...
దిశ (ఉభయ గోదావరి): జనవరి నెలలో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో బీసీల సదస్సు నిర్వహించనున్నట్లు మాజీ శాసన సభ్యుడు, టీడీపీ అధికార ప్రతినిధి వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన 200 మంది మత్స్యాకారులతో సమావేశం నిర్వహించారు. వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ, అమీనాబాద్ వంటి ప్రాంతాల్లో మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా వేట లేక చాలా మంది ఉపాధిని కోల్పోయారని, పలు విషతుల్య కంపెనీల వల్ల సముద్రంలో చేపలు కూడా చనిపోతున్నాయన్నారు. ఈ విషయమై అధికార పార్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని వర్మ విమర్శించారు.
ఇవి కూడా చదవండి : Minister Ambati: నోరు అదుపులో పెట్టుకో Chandrababu