చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హెల్త్ బులిటెన్‌ను రాజమండ్రి జైలు అధికారులు, వైద్యులు విడుదల చేశారు..
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్‌గా ఖైదీగా జైలు జీవితం అనుభవిస్తున్నారు. అయితే ఆయనకు ఇటీవల చర్మ వ్యాధి సోకింది. ఆ సమయంలో చంద్రబాబుకు ప్రత్యేకంగా వైద్యుల బృందం చికిత్స అందించింది. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు, వైద్యులు చంద్రబాబు ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్లు విడుదల చేస్తున్నారు. తాజాగా కూడా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చంద్రబాబు హెల్త్ వివరాలు ఇవే..