Kakinada: రెండు కాళ్లు పోయినా.. 14 రోజులు పోరాడి ఓడిన బాలుడు
విద్యుదాఘాతానికి బాలుడు బలి అయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లూపుడి మండలంలో జరిగింది. ...
దిశ వెబ్ డెస్క్: విద్యుదాఘాతానికి బాలుడు బలి అయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లూపుడి మండలం పైడిమిట్టలో జరిగింది. ఈ నెల 12న ఇంటిపై ఆడుకుంటున్న బాలుడు దర్శిత్‌కి 33 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే ఇన్‌ఫెక్షన్ కావడంతో బాలుడి రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలుడు దర్శిత్ ఈ రోజు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఎంతో ముద్దుముద్దుగా ఉండే తమ బాలుడు ఇంక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
READ MORE
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ పరిస్థితి కార్టూన్ (24-11-2022)