Dy CM Pawan Kalyan: ‘అటవీ అమరవీరుల త్యాగాలు మర్చిపోకూడదు’
అటవీశాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారంతా అమరవీరులని, వారి త్యాగాలు మర్చిపోకూడదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: అటవీశాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారంతా అమరవీరులని, వారి త్యాగాలు మర్చిపోకూడదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నేడు (ఆదివారం) గుంటూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం అరణ్యభవన్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఆయన ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది అమరవీరులని, వీరి త్యాగాలు మర్చిపోకూడదని కొనియాడారు. అడవులను రక్షించేందుకు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, అటవీశాఖకు సంపూర్ణ మద్దతు ఇస్తానని ఆయన్నారు. అలాగే అటవీశాఖలో తీవ్ర సిబ్బంది కొరత ఉందని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఆ సమస్య పరిష్కారంపై ప్రభుత్వంతో మాట్లాడతానని అన్నారు.