అగ్గిపెట్టెలో దుర్గమ్మకు చీర.. అమ్మవారికి కానుకగా అందజేసిన సిరిసిల్ల చేనేతకారుడు విజయ్

బెజవాడ కనకదుర్గమ్మకు ఓ భక్తుడు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను కానుకగా సమర్పించారు.

Update: 2023-04-11 08:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : బెజవాడ కనకదుర్గమ్మకు ఓ భక్తుడు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను కానుకగా సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు విజయ్‌ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను రూపొందించారు. బంగారం, వెండి జరీతో చీరను నేశారు. ఈ చీరను తయారు చేసేందుకు సుమారు రూ.45వేలు ఖర్చు అయ్యింది. ఐదు గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండితో పూర్తి పట్టధారాలతో నేసిన చీరను చేనేత కళాకారుడు విజయ్ సోమవారం సమర్పించారు. తొలుత చీరకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ..చీర సుమారు 100 గ్రాముల బరువు ఉంటుందని..బంగారం మరియు వెండి కలబోసి నేసిన చీర అని తెలిపారు. చేనే వృత్తిని కాపాడాలని..చేనేత కార్మికులు మరుగున పడిపోకూడదని అమ్మవారిని వేడుకున్నట్లు చేనేత కళాకారుడు విజయ్ వెల్లడించారు.

Also Read..

Minister Roja: దేశంలోనే బెస్ట్ టూరిజం స్పాట్‌గా ఆంధ్రప్రదేశ్. 

Tags:    

Similar News