AP News:‘ఆ ఉద్యోగులను తొలగించొద్దు’.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఫైరయ్యారు.

Update: 2024-12-25 09:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఫైరయ్యారు. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులను తొలగిస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ పై కోపం ఉంటే తమతో పోరాడాలి.. కానీ తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించొద్దు అని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.

కూటమి ప్రభుత్వం(AP Government) వచ్చాక వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని విమర్శించారు. బాదుడే బాదుడు అంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శించారని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 15,485 కోట్ల విద్యుత్ ఛార్జీలు(Current Charges) బాదారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని గతంలో చెప్పిన టీడీపీ నేతలు.. ఇప్పుడు స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని చెప్పారు. అప్పుల కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారని.. అప్పులతో ప్రభుత్వాన్ని నడిపే స్థితికి వచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఆదాయం పడిపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్(Super Six) హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు.


Similar News