AP:జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా..క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి నూతన పభ్రుత్వం ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-10 11:15 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి నూతన పభ్రుత్వం ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై వస్తున్న వార్తలపై తాజాగా వైసీపీ ఎంపీ ఘాటుగా స్పందించారు. వివరాల్లోకి వెళితే..ఏపీ మాజీ సీఎం జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ..జగన్ రాజీనామా చేస్తారనే ప్రచారంలో నిజం లేదన్నారు. కావాలనే కొందరు జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ బాండ్లు విషయంలో ఎక్కడ అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక పాలసీ పై కావాలంటే విచారణ చేయోచ్చు కానీ గత ప్రభుత్వం పై నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి రావాల్సిన నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు.


Similar News