Pawan Kalyan:నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు డిప్యూటీ సీఎం పవన్‌ దిశానిర్దేశం

ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డియే కూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-09 14:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డియే కూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా పలు నియోజకవర్గాల్లో మూడు పార్టీల్లోని అభ్యర్థులు తమ సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారికి టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీలు నామినేటెడ్ పదవులు(Nominated posts) ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు(శనివారం) నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేశారు. దీంతో పలువురు కూటమి నేతలు పదవులు పొందారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) దిశానిర్దేశం చేశారు. ప్రతి పదవి ప్రజలకు మేలు చేసే ఓ బాధ్యత అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ(AP Government) విధి విధానాలకు అనుగుణంగా పని చేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లాలని అన్నారు. కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగొద్దు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News