చెప్పులు వేసుకుని ‘వారాహి దీక్ష’ చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. అంటే జూన్ 26 వ తారీకు నుంచి పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభించారు. కాగా ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. అయితే పవన్ కల్యాణ్ నేడు అమ్మవారి బట్టల్లో చెప్పులు వేసుకుని దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎంతో పద్ధతిగా నుదుటగా బొట్టు, పసుపు రంగు అమ్మవారి బట్టల్లో జనాలను ఆకట్టుకుంటున్నప్పటికీ పవన్ చెప్పులు ధరించడం పలువురు జనాలను షాక్‌కు గురిచేస్తుంది. పవన్ కల్యాణ్ చెప్పులు వేసుకుని అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫొటోలను కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పవన్ పిక్‌కు ‘బీజేపీని మెప్పించడానికా? చెప్పుతో దీక్షలు.. వాట్ ఏ హిందూ ఫాలోవర్’ అంటూ రెండు పగలబడి నవ్వే బొమ్మలను జోడించింది.
ఇక ఈ దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారట. గత సంవత్సరం జూన్ నెలలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత పవన్ 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. గత పదేళ్లుగా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలను, సవాళ్లను ఎదుర్కొన్న జనసేనాని వాటన్నింటికీ ఈ విజయంతో సమాధానమిచ్చారు.