ఈ నెల 29న కొండగట్టుకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అయితే పవన్ నేటి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. కాగా ఈ దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ ఈ నెల (జూన్)29 వ తేదీన కొండగట్టుకు రానున్నారు. పవన్ కల్యాణ్ హోదాలో మొదటిసారి అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. కొండగట్టులోనే వారాహి పూజ కోసం ఆలయ సిబ్బంది ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వారాహి దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన అంజన్న సన్నిధికి వస్తున్నారు. ఎంతో నిష్టగా చేపట్టిన వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నన్ని డేస్ పవన్ కల్యాణ్ కేవలం పండ్లు, పాలు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు.
ఇకపోతే కోట్లాది మంది అభిమానుల మనసుల్ని దోచుకున్న పవన్ కల్యాణ్.. వారి ఆశీస్సులతో నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారనే స్వయంగా ఆయనే ఓ సభలో చెప్పుకొచ్చారు. కానీ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ చెప్పులు ధరించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది. పవన్ చెప్పులు ధరించి.. అమ్మవారి బట్టల్లో కనిపిస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ తరచూ ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసే బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి పెట్టడంతో నెట్టింట సంచలనంగా మారింది.