అమృతధార ప్రాజెక్టును ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో అమృతధార ప్రాజెక్ట్ ప్రారంభించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయవాడలో అమృతధార ప్రాజెక్ట్(Amritdhara Project) ప్రారంభించారు. రాష్ట్రంలో సుస్థిరమైన నీటి వనరుల వినియోగం తో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్(Jal Jeevan Mission) విజయవంతంగా అమలు చేసేందుకు గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం అధికారులతో విజయవాడలోని లెమెన్ ట్రీ హోటల్‌లో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ ఏర్పాటు చేయగా.. గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన పలు డిజైన్లను పవన్ కల్యాణ్ పరిశీలించి.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడే ఆయన మాట్లాడుతూ.. జల్‌జీవన్ మిషన్(Jal Jeevan Mission)లో గత ప్రభుత్వం రూ.4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. నీటిని ఎక్కడి నుంచి తేవాలో.. గుర్తించక ముందే పైపులు వేశారని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా రూ.70వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్(Union Minister CR Patil)ను కోరామని.. ఆయన సానుకూలంగా స్పందించి.. పూర్తి వివరాలతో రావాలని సూచించినట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.
కాగా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ తో పాటు శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఐఏఎస్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ ఐఏఎస్, RWS & S ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ్ రెడ్డి, RWS & S ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, RWS & S చీఫ్ ఇంజనీర్ హరే రామ్ నాయక్, రాష్ట్రంలోని 36 జిల్లాలకు సంబంధించిన గ్రామీణ నీటి సరఫరా & పారిశుద్ధ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.