BREAKING: కంట తడి పెట్టుకున్న డిప్యూటీ CM, తట్టుకోలేక కూతురు సైతం కన్నీళ్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కంటతడి పెట్టుకున్నారు. సోమవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కంటతడి పెట్టుకున్నారు. సోమవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అగ్రకులాల నేతల తనపై చేసిన మాటలు బాధ కలిగించాయని ఎమోషనల్ అయ్యారు. తండ్రి కంటతడి పెట్టుకోవడంతో అదే కార్యక్రమంలో ఉన్న డిప్యూటీ సీఎం కూతురు కృపాలక్ష్మి సైతం కన్నీరుమున్నీరయ్యారు. చేసే పనిలో మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడొద్దని.. ధైర్యంగా ఉండాలంటూ కూతురు కృపాలక్ష్మిని నారాయణ స్వామి ఓదార్చారు. ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని.. నేతలు, కార్యకర్తలు అంతా మాకు సమానమేనని అన్నారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఆయన కూతరు కంటతడి పెట్టుకోవడంతో కార్యక్రమానికి హాజరైన పలువురు కార్యకర్తలు సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక, ఇటీవల వైసీపీ అభ్యర్థులు, ఇన్‌చార్జుల మార్పులు చేర్పులు చేపట్టిన జగన్.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని గంగాధార అసెంబ్లీ నుండి ప్రాతినిధ్యం వహిస్తోన్న నారాయణ స్వామికి ఈ సారి టికెట్ కష్టమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారి గంగాధర వైసీపీ టికెట్ జ్ఞానేందర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read More..