Breaking:CS,DGP నీ బదిలీ చేయాలి..ఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రాయితో దాడి జరగ్గా సీఎం జగన్ గాయపడిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ సీఎంపై దాడి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Update: 2024-04-16 13:36 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రాయితో దాడి జరగ్గా సీఎం జగన్ గాయపడిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ సీఎంపై దాడి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.  ఈ ఘటనపై అన్ని పార్టీల నేతలు స్పందించిన సంగతి తేలిసిందే. ఈ దాడి జరగడానికి గల కారణాలు, భద్రత వైఫల్యాలు ఎంటో తెలుసుకోవాలని అన్ని పార్టీల నేతలు ఆదేశించారు.  రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు కమిషనర్, సీఎం సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ చేయించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పలువురు కూటమి నేతలు ఈసీని కలిసినట్లు సమాచారం. అధికార యంత్రాంగాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ ని బదిలీ చేయాలని కోరారు. విపక్ష నేతలను ప్రభుత్వం వేధిస్తోందని చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, సమస్యత్మాక పొలింగ్ బూత్ లలో వీడియో రికార్డింగ్ చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. ఈసీని కలిసిన వారిలో కనకమేడల రవీంద్ర, నాదేండ్ల మనోహర్, జీవీఎల్ నరసింహారావు ఉన్నారు.


Similar News