కల్తీ నెయ్యిలో వచ్చిన కమీషన్ జగన్‌కు వెళ్లింది.. CPI నారాయణ సంచలన ఆరోపణలు
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి(Ghee) కలవడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డే(Jagan Mohan Reddy) కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) సంచలన ఆరోపణలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి(Ghee) కలవడానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డే(Jagan Mohan Reddy) కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం నారాయణ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం వచ్చిందని అన్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తక్కువ ధరకే నెయ్యి టెండర్ ఇచ్చి కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఈ కల్తీ నెయ్యిలో వచ్చిన కమీషన్ జగన్‌కి కూడా వెళ్లిందని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను జగన్ మంట గలిపారని మండిపడ్డారు. ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. అసలు కర్ణాటక నెయ్యి టెండర్‌ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యిపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.