‘సాయిబాబాది సహజ మరణం కాదు’.. సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు

నేడు గన్‌పార్క్ వద్ద విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ సాయిబాబా భౌతికకాయనికి పలువురు మంత్రులు ఘన నివాళులు అర్పించారు.

Update: 2024-10-14 11:51 GMT

దిశ,వెబ్‌డెస్క్: నేడు గన్‌పార్క్ వద్ద విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ సాయిబాబా భౌతికకాయనికి పలువురు మంత్రులు ఘన నివాళులు అర్పించారు. ఈ క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఈ రోజు గన్‌పార్క్ వద్ద సాయిబాబా భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా అకాల మరణం బాధాకరం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాయిబాబాది సహజ మరణం కాదని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. సాయిబాబా చనిపోయిన ఆయన సిద్ధాంతాలు బతికే ఉంటాయన్నారు. పదేండ్లు అన్యాయంగా అతడిని నాగ్‌పూర్‌ జైళ్లో బంధించారని విమర్శించారు. ఆయన హత్యకు అసలు దోషి ఎవరో ప్రభుత్వం తేల్చాలని సీపీఐ నారాయణ డిమాండ్‌ చేశారు.

Similar News