AP News:పేదలకు రూ.5 లక్షలతో పక్కా గృహం నిర్మాణం: కాంగ్రెస్

ఇల్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షలతో పక్కా గృహం నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందని రాయచోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అల్లాబక్షు అర్ధాంగి షేక్ చాన్ బేగం అన్నారు.

Update: 2024-04-27 15:07 GMT

దిశ,రాయచోటి: ఇల్లు లేని నిరుపేదలకు రూ.5 లక్షలతో పక్కా గృహం నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందని రాయచోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అల్లాబక్షు అర్ధాంగి షేక్ చాన్ బేగం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మున్సిపాలిటీ పరిధిలోని సైదియా థియేటర్ వీధి ఎస్ఎన్ కాలనీ పురవీధుల్లో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అభివృద్ధి పథకాలే ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తుందని ఆమె అన్నారు.

దేశంలో ఇంతవరకు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా అమలు చేయలేదు. అలాంటిది మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఈ 9 గ్యారెంటీల పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. వృద్ధులకు, వితంతువులకు నెలకు 4000 పెన్షన్, వికలాంగులకు నెలకు 6000 పెన్షన్, యువ వికాసం ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆమె ఓటర్లకు వివరించారు. ఈ పథకం అమలు కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజల హస్తం గుర్తుపై ఓటు వేయాలి.

కాబట్టి రాబోవు ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రండి కాంగ్రెస్ 9 గ్యారంటీలు పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లా బకష్ (సీఎల్పీ) కు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డిసిసి చీఫ్ సెక్రటరీ అమీర్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అలీ ఖాన్, సేవల అధ్యక్షులు అమీర్ భాష, ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ్, మండల అధ్యక్షులు నూరుల్లా పట్టణ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ జిల్లా సెక్రటరీ బషీర్ అహ్మద్ పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Read More...

మోడీని నిలదీసే ధైర్యం జగన్‌కు లేదు..వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News