ఏపీలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ షురూ
ఏపీ(AP)లో కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో కానిస్టేబుళ్ళ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి, ఫలితాలు విడుదల చేసింది. అనంతరం ఎన్నికల ప్రక్రియ మొదలవగా.. తాత్కాలికంగా కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఆ నియామక ప్రక్రియ మరింత మరుగున పడింది. కాగా ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చి ఏడాదిన్నర అవుతుండటంతో.. ఇకనైనా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హోంమంత్రి కార్యాలయానికి భారీగా వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత కానిస్టేబుల్ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను https://slprb.ap.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చని హోంమంత్రి పేర్కొన్నారు.