తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన ముగిసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తిరుమల చేరుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన ముగిసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తిరుమల చేరుకున్నారు. అనంతరం శ్రీవారికి పట్టువస్త్రాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోనే బస చేసిన సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల వెంకటేశ్వేరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో సీఎం వైఎస్ జగన్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో సీఎం జగన్ తో పాటు టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఆర్‌కే రోజా తదితరులకు ఉన్నారు. స్వామివారి దర్శనం అనంతరం మంగళవారం ఉదయం 9.20 గంటలకు సీఎం జగన్ తిరుపతి పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు వీడ్కోలు పలికారు.