AP News:జీపీఎస్ గెజిట్ నిలిపివేయాలని సీఎం ఆదేశాలు

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS)ను అమలు చేస్తు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నాయి.

Update: 2024-07-16 13:55 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS)ను అమలు చేస్తు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పాత జీపీఎస్‌ను రద్దు చేసి కొత్త OPS పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని SGTF, PRTU, UTF, CPS ఉద్యోగ సంఘాల నేతల నుంచి డిమాండ్‌లు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో నిన్న(సోమవారం) జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు జీపీఎస్ గెజిట్ జారీ పై ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై ఆరా తీశారు. జీపీఎస్ గెజిట్ జారీ పై చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వ ప్రతిపాదన పై ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం పై సీఎం చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో తక్షణమే జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ నిలుపుదల చేస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలపై సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన అధికారులపై విచారణకు సీఎం ఆదేశించడం పట్ల ఉద్యోగులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.


Similar News