నిరుద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు.
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. పొల్యూషన్ బోర్డు, వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సింగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 59 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవోలు ఎంఎస్-95, ఎంఎస్- 96లను ప్రభుత్వం విడుదల చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ల పోస్టులు (21), గ్రేడ్ -2 ఎనలిస్ట్ల పోస్టుల (18) ను భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు (19), అసిస్టెంట్ లైబ్రేరియన్ (1) పోస్టులను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయాలని నోటిఫికేషన్లో వెల్లడించింది.