సీఎం గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లో డబ్బులు జమ

ఏపీ సీఎం జగన్ విద్యార్థులకు తీపికబురు అందించారు. నేడు జగనన్న వసతి దీవెన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.ూ12,71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది.

Update: 2023-04-26 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ సీఎం జగన్ విద్యార్థులకు తీపికబురు అందించారు. నేడు జగనన్న వసతి దీవెన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.ూ12,71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది.

ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈక్రమంలో జిల్లాలోని నార్పలలో జరిగే కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. దీంతో సీఎం పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఇప్పుడు విడుదల చేసే నిధులతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసినట్లు సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు. జగనన్న వసతి దీవెన. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులకు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Breaking: సీఎం జగన్‌‌కు రైతుల షాక్.. కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం..!

Tags:    

Similar News