పవన్ కల్యాణ్ భార్యలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన CM జగన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్యలపై CM జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్యలపై CM జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మేమంతా సిద్ధం సభ భీమవరంలో నిర్వహించారు. ఈ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశిస్తూ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడు నాలుగేళ్లకోసారి కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడని ఆరోపణలు చేశారు. భీమవరంలో జనసముద్రం కనిపిస్తోందని, సభను చూస్తుంటే గోదావరి ఉప్పొంగినట్టు అనిపిస్తోందని అన్నారు. నా మీద రాళ్లు వేయండి.. అంతం చేయండి అని చంద్రబాబు చెబుతున్నాడన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తుకొస్తుందా? ఆయనకు నా మీద కోపంతో బీపీ షుగర్ పెరుగుతుందని, చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చేది వెన్నుపోటు, మోసం, కుట్రలు అని ఆరోపించారు. ఈ మధ్య నాకు శాపనార్థాలు పెడుతున్నాడని అన్నారు. మంచి చేయడం మన ప్రోగ్రెస్ రిపోర్ట్, మోసం చేయడం చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అని చెప్పుకొచ్చారు. అలాగే మధ్యలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చి.. దత్తపుత్రుడు నాలుగేళ్లకోసారి కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తున్నాడని సెటైర్లు వేశారు.
Read More : రొయ్యకు మీసం.. చంద్రబాబు మోసం పుట్టుతోనే వచ్చాయి ...భీమవరం సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు