ఎన్నికల సమరానికి సిద్ధమైన సీఎం జగన్.. రేపటి నుంచే శంఖారావం

వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరింత దూకుడు పెంచారు..

Update: 2024-01-26 11:14 GMT

దిశ, వెబ్ డెస్క్: వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమిస్తున్న ఆయన మరో కీలక అడుగు ముందుకు వేశారు. శనివారం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇందుకు భీమిలిని వేదిక‌గా ఎంచుకున్నారు. అక్కడ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.ఈ వేదిక నుంచే తాను ఎన్నికల సవాల్‌ను స్వీకరించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలను సైతం సమాయత్తం చేశారు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.

తొలి సభ సక్సెస్‌‌ బాధ్యతలు ఆయనకే..

ఈ మేరకు తొలి సభ సక్సెస్‌తో‌నే పార్టీ నేతలు, కార్యకర్తల్లో పుల్ జోష్ నింపాలని భావిస్తున్నారు.  సభ‌ను సక్సెస్ బాధ్యతలను మంత్రి అమర్‌నాధ్‌కు అప్పగించారు. దీంతో ఆయన భీమిలీ సభను సక్సెస్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. స్వయంగా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఈ సభకు కార్యకర్తలను భారీగా సమీకరించే పనిలో పడ్డారు. తొలి సభతోనే రాష్ట్రం మొత్తం తమ వైపు చూసేలా చేయాలని భావిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో మరిన్ని సభలు, సీఎం ప్రసంగాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ బహిరంగ సభలకు నిర్వహించాలని నిర్ణయించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే ఏం చేస్తాం..ఇప్పటివరకూ ఏం చేశామనేది ఈ సభల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. అంతకుముందు పాలించిన పార్టీలు రాష్ట్రానికి  ఏం చేశాయనేది కూడా వివరించాలని నిర్ణయించారు.


మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు భీమిలి వైసీపీ సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. ఎంతమంది కలిసి వచ్చినా తమదే గెలుపు అని అమర్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీని ఓడించాలనే కుట్రతోనే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. జగన్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలే వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని అమర్‌నాధ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News