Andhra Pradesh:సినీ ఇండస్ట్రీ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఏర్పడ్డాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఏర్పడ్డాక అందరికీ భవిష్యత్తుపై భరోసా వచ్చిందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సినిమా రంగం(Film industry)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ రంగానికి హైదరాబాద్ నగరం హబ్‌గా మారిందని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. కొంతకాలంగా సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఇక ఏపీ(Andhra Pradesh)లోనే అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.