CM Chandrababu:రేపు హర్యానా వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. కారణం ఏంటంటే?

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రేపు(గురువారం) హర్యానా (Haryana)లో పర్యటించనున్నారు.

Update: 2024-10-16 08:55 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) రేపు(గురువారం) హర్యానా (Haryana)లో పర్యటించనున్నారు. నయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) హర్యానా ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు హజరుకానున్నారు. కాగా గురువారం ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ ఎయిర్ పోర్ట్(Vijayawada Airport) నుంచి బయలుదేరి, 11 గంటలకు చంఢీఘర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య పంచకుల, సెక్టార్ 5లోని దసరా గ్రౌండ్‌కు చంద్రబాబు వెళ్తారు. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన నయాబ్ సింగ్ సెనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించే సమావేశంలో(Meeting) పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు అక్కడి నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరి విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News