Tirumala: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు..

Update: 2024-10-04 15:02 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన ఆయన తొలుత బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వరిపట్టం చుట్టుకుని పట్టువస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి వెళ్లారు. సతీ సమేతంగా ప్రభుత్వం తరపున స్వామివారిని చంద్రబాబు దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ అధికారులు చంద్రబాబు దంపతులను స్వాగతించి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.

కాగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు కుటంబ సభ్యులు వెంకన్న సేవలో పాల్గొన్నారు. సీఎం హోదాలో చంద్రబాబు తిరుమల వెంకన్నకు ఇప్పటి వరకు పది సార్లకు పైగానే పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి తిరుమలలోనే బస చేసి నూతనంగా నిర్మించిన వకుళామాత నూతన వంటశాలను శనివారం ఉదయం ప్రారంభించనున్నారు.


Similar News