2025 Year:నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) 2025 సంవత్సరానికి ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్‌ను, డెయిరీను ఆవిష్కరించారు.
దిశ,వెబ్‌డెస్క్: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) 2025 సంవత్సరానికి ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నేడు(శనివారం) ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్యాలెండర్‌లో రాజ్యాంగ రచనలో పాల్గొన్న తెలుగు ప్రముఖులను స్మరించుకునే విధంగా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామకృష్ణం రాజు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు శాసన వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకు రావడానికి శాసన వ్యవస్థ అధికారిక ఖాతాలను ప్రారంభించారు. 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్), YouTube (@Legis Andhra), Instagram, Facebook (@legisandhra) ద్వారా శాసనసభ కార్యకలాపాలను ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. ఈ ప్రయత్నం శాసన వ్యవస్థ పనితీరును ప్రజల వరకు మరింత సులభతరం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.