AP News:ఎస్సీ వర్గీకరణపై 1996లోనే కమిషన్ వేశాం: సీఎం చంద్రబాబు

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Update: 2024-08-01 13:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం వద్ద సున్నిపెంట లో నేడు(గురువారం) సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను తాను ఆనాడే ప్రతిపాదించానని వెల్లడించారు. 1996లోనే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై టీడీపీ ముందడుగు వేసిందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి సామాజిక న్యాయం గెలవాలనేది టీడీపీ సిద్ధాంతం అన్నారు. అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుంది. దళితులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చెందాలి అని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News