అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై సీఎం చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్

అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంపై సీఎం చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు...

Update: 2024-08-22 08:20 GMT

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కొంత మంది క్షతగాత్రులు, వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరుపై క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకూ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్సలపై ఆరా తీశారు. విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, బాధత కుటుంబాలకు ఆయన భరోసా ఇచ్చారు. భాసటగా ఉంటామని  చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. వాటిని సరిచేస్తున్నామని తెలిపారు. ఈ లోపే ప్రమాదం జరిగిందని, ఘటనలో 17 మంది చనిపోయారని తెలిపారు. ఎంత ఖర్చు అయినా సరే బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఫార్మా ఘటన తనను చాలా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు.

‘‘ఈ సంఘటన వల్ల 36 మందికి గాయాలయ్యాయి. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించాం. బాధితులందరూ త్వరగా కోలుకోని మళ్లీ ఉద్యోగం చేసుకోవాలి. ’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. 

Tags:    

Similar News