Breaking: టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. తొక్కిసలాట ఘటనపై చర్చ
తిరుపతి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు..
దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల(Srivari Vaikunta Dwara Darshans) నేపథ్యంలో తొక్కిసలాట(Stampede) జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు అంశాలపై తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకన్న చౌదరీ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరులు, ఎస్పీ సుబ్బారాయుడు, మంత్రులు సత్యకూమార్, నిమ్మల, ఇతర అధికారులు హాజరయ్యారు. తిరుపతి తొక్కిసలాట ఘటన, రేపటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సీఎంకు అధికారులు వివరించారు. అయితే సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇప్పటికే సమావేశమయ్యారు. తొక్కిసలాట ఘటనపై చర్చించారు. అంతకుముందు తిరుపతి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కాగా బుధవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. సీఎం ఆదేశాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు టోకెన్లు పొందేందుకు బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తిరుపతికి చేరకున్నారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ సమయంలో తొక్కిసలాట జరగడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.